మహిళల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్న మేయర్

నవతెలంగాణ – కంటేశ్వర్
నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్ లో జరుగుతున్న ఆరోగ్య మహిళ కేంద్రాన్ని మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ సందర్శించారు.హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ స్నేహ తో మాట్లాడుతూ ప్రజల నుండి వస్తున్న స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య మహిళ కేంద్రం గురుంచి ప్రజలలో అవగాహన కల్పించాలని అన్నారు.ఈ సందర్బంగా మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి  కెసిఆర్  ఇంటికి దీపం ఇల్లాలు అనే నానుడిని నిజం చేస్తూ మహిళల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని చేపట్టారని ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రతి మంగళవారం మహిళలకు ఆరోగ్య పరిరక్షణకై పరీక్షలు నిర్వహించి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే జిల్లా ఆసుపత్రిలో వైద్యం అందించే విధంగా సేవలను అందిస్తున్నారని అన్నారు.ప్రభుత్వం అందిస్తున్న సేవలను మహిళలు ఆరోగ్యనికి అధిక ప్రాధన్యం ఇవ్వాలని ఏమైనా సమస్యలు ఉంటే పరీక్షలు చేయించాకోవాలని విజ్ఞప్తి చేసారు.

 

Spread the love