కల్యాణ లక్ష్మీ పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా

– ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌
నవతెలంగాణ-దేవరకొండ
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి కొండంత భరోసా అని దేవరకొండ శాసనసభ్యులు, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్‌ రవీంద్ర కుమార్‌ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ మండలానికి చెందిన 24 మందికి రూ.24లక్షలు, డిండి మండలానికి చెందిన 12మందికి రూ.12లక్షలు కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్‌ చెక్కులను, చీరలను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకళ్యాణ లక్ష్మీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు రాజు, జడ్పీటీసీ సలహాదారుడు మారుపాకుల సురేష్‌ గౌడ్‌, వైస్‌ ఎంపీపీ చింతపల్లి సుభాష్‌, రైతు బంధు అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్‌ గౌడ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు టీవీఎన్‌.రెడ్డి, మునికుంట్ల వెంకట్‌రెడ్డి, పొన్నబోయిన సైదులు, మేకల కాశన్న, గోసుల అనంతగిరి, బొడ్డుపల్లి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love