నిఖ‌త్ జ‌రీన్‌కు రూ. 2 కోట్ల సాయం ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్

నవతెలంగాణ – హైద‌రాబాద్ : తెలంగాణ స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ప్ర‌పంచ బాక్సింగ్ ఛాంపియ‌న్ నిఖ‌త్ జ‌రీన్ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఒలింపిక్ పోటీల శిక్ష‌ణ‌, ఖ‌ర్చుల కోసం నిఖ‌త్‌కు రూ. 2 కోట్ల సాయం ప్ర‌క‌టించారు కేసీఆర్. ఒలింపిక్ పోటీల్లో పాల్గొనేందుకు ప్ర‌భుత్వం సంపూర్ణ స‌హ‌కారం అందిస్తుంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. జ‌రీన్ శిక్ష‌ణ‌, ర‌వాణా త‌దిత‌ర ఖ‌ర్చుల‌ను ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Spread the love