నవతెలంగాణ- న్యూఢిల్లీ: గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన కీలక నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 23 ఏళ్ల ఆ వ్యక్తిని యూపీలోని మెయిన్‌పురిలో పట్టుకన్నారు. జూన్ 23వ తేదీన ఓ మైనర్‌పై ఓ ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలొ అదే రోజున ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మరో ముగ్గురు ఆమెను రేప్ చేశారు. తొలుత మహమ్మద్ మిరాజ్‌తో పాటు మరో యువకుడు తనను రేప్ చేసినట్లు ఆ అమ్మాయి ఫిర్యాదులో పేర్కొన్నది. ఆ తర్వాత తన మేనమామ ఇంటికి వెళ్లాలని, ఆయన ఇద్దరు వ్యక్తులతో తనను ఇంటికి పంపించారని, అయితే ఆ ఇద్దరితో పాటు మరో వ్యక్తి కూడా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. మైనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్వరూప్ నగర్ పోలీసు స్టేషన్‌లో అయిదుగురిపై కేసు నమోదు చేశారు. మిరాజ్‌తో పాటు ఓ యువకుడిని గతంలోనే అరెస్టు చేశారు. కర్నన్, కమల్ అనే వ్యక్తులు పరారీలో ఉన్నారు. కర్నన్ ని మెయిన్‌పురిలో ప్లాన్ వేసి పట్టుకున్నారు.