13వ సారి ‘శాఫ్’ ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్

నవతెలంగాణ – బెంగళూరు
బెంగళూరులో జరుగుతున్న దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య చాంపియన్ షిప్ లో ఆతిథ్య భారత జట్టు ఫైనల్ కు చేరుకుంది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్లో భారత్ పెనాల్టీ షూటౌట్ లో 4-2 గోల్స్ తేడాతో తో లెబనాన్‌పై గెలిచింది. నిర్ణీత సమయం, అదనపు సమయంలోఇరు జట్లూ ఇరు జట్లూ గోల్స్‌ చేయలేకపోయాయి. దాంతో, విజేతను తేల్చేందుకు షూటౌట్ నిర్వహించారు. ఇందులో భారత్‌ తరఫున నాలుగు ప్రయత్నాల్లో కెప్టెన్ సునీల్‌ ఛెత్రి, అన్వర్‌ అలీ, మహేష్‌ సింగ్‌, ఉదాంత్‌ సింగ్‌లు గోల్‌ చేశారు. లెబనాన్‌ నాలుగు ప్రయత్నాల్లో రెండు గోల్స్ మాత్రమే చేసి ఓడిపోయింది. ఆ జట్టు ఆటగాడు హసన్‌ కొట్టిన తొలి కిక్‌ను భారత గోల్‌ కీపర్‌ అడ్డుకొన్నాడు. తర్వాత వలీద్‌ షోర్‌, సాదిక్‌ గోల్స్‌ చేశారు. నాలుగో కిక్‌ను ఖలీల్‌ బాదర్‌ బయటకు కొట్టడంతో భారత్ మ్యాచ్ గెలిచింది. ఈ టోర్నీలో భారత్‌ ఫైనల్‌కు చేరడం ఇది 13వసారి. మరో సెమీ ఫైనల్లో కువైట్ 1-0 తేడాతో బంగ్లాదేశ్ పై గెలిచింది. ఎల్లుండి జరిగే ఫైనల్లో భారత్, కువైట్ జట్లు పోటీ పడుతాయి.

Spread the love