రాష్ట్రవ్యాప్తంగా 17 బీసీ డిగ్రీ గురుకులాలు ప్రారంభం…

నవతెలంగాణ – హైద‌రాబాద్: వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ది కోసం కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 నూతన బీసీ డిగ్రీ గురుకులాలు ప్రారంభించడానికి శుక్ర‌వారం జీవో జారీ చేయడమే అందుకు నిదర్శనం అన్నారు. తెలంగాణకు పూర్వం కేవలం 19 బీసీ గురుకులాలు అరకొర వసతులతో ఉండేవని, సీఎం కేసీఆర్ సంకల్పంతో వాటిని నేడు 327కు పెంచుకున్నామ‌ని క‌మ‌లాక‌ర్ తెలిపారు. విద్య ద్వారా వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పులు వస్తాయని నమ్మే సీఎం కేసీఆర్, అందుకోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటారన్నారు. కేవలం బీసీ గురుకులాల ద్వారానే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది వెనుకబడిన బిడ్డలు ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యను అభ్యసిస్తున్నార‌ని తెలిపారు.

Spread the love