నవతెలంగాణ హైదరాబాద్: టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో) పరీక్ష హాల్‌టికెట్లు https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో టీఎస్‌పీఎస్సీ అందుబాటులో ఉంచింది. మున్సిపల్ శాఖలో 175 ఉద్యోగాల భర్తీకి గతేడాది సెప్టెంబర్ 7న వెలువడిన నోటిఫికేషన్ కు ఈ నెల 8న పరీక్ష నిర్వహించనున్నారు. 8వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (సీబీఆర్‌టీ) పద్ధతిలో జరిగే ఈ పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. మాక్‌టెస్ట్ లింక్‌ను అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు ముందుగా ప్రాక్టీస్ చేయాలని ఆమె తెలిపారు.