విడాకులు తీసుకున్న నిహారిక కొణిదెల-చైతన్య

niharika-konidela-chaitanya
niharika-konidela-chaitanya

నవతెలంగాణ – హైదరాబాద్
నిహారిక కొణిదెల, చైతన్యలకు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టు మంగళవారం విడాకులు మంజూరు చేసింది. వీరు ఆమధ్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిహారిక కొణిదెల, చైతన్య విడిపోనున్నారనే వార్తలు కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. పరస్పర అంగీకారంతో వీరు ఇప్పుడు విడాకులు పొందడంతో ఆ వార్తలు నిజమయ్యాయి. కొన్నిరోజులుగా వీరి మధ్య మనస్పర్దలు రావడంతో కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫొటో సోషల్ మీడియాలోను వైరల్ గా మారింది. ఇటీవల చైతన్య తన ఇన్‌స్టా పేజి నుండి నిహారికకు సంబంధించిన ఫొటోలను తొలగించారు. దీంతో వీరు విడిపోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్నిరోజులకు నిహారిక కూడా చైతన్య ఫొటోలను తొలగించింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ ఈవెంట్లకు చైతన్య హాజరుకాలేదు. ఇద్దరిమధ్య అభిప్రాయభేదాలు రావడంతో కొన్నిరోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు. నిహారిక ఇటీవల తన ప్రొడక్షన్ వ్యవహారాలకు సంబంధించిన కార్యాలయాన్ని హైదరాబాద్ లో తెరిచింది. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాల ఫొటోలలో చైతన్య ఎక్కడా లేరు. నిహారిక 2020 డిసెంబర్ లో చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్నారు. రెండేళ్లకే విభేదాల కారణంగా ఇప్పుడు విడిపోయారు.

Spread the love