లైంగికదాడి బాధితుల కేసులో కేరళ కోర్టు కీలక తీర్పు

నవతెలంగాణ-హైదరాబాద్ : లైంగికదాడి బాధితులను అబార్షన్ కు అనుమతించకపోవడమంటే వారు గౌరవంగా బతికే హక్కులను అడ్డుకోవడమేనని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. బాధితులు మాతృత్వం పొందాల్సిందేనని చెప్పలేమని జస్టిస్ కౌసర్ ఎడప్పగాత్ అన్నారు. 16ఏళ్ల ఓ లైంగికదాడి బాధితురాలికి 24వారాల తర్వాత అబార్షన్ చేయించుకునేందుకు కోర్టు తాజాగా అనుమతిచ్చింది. కాగా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం అబార్షన్ కు గరిష్ఠ పరిమితి 24వారాలుగా ఉంది.

Spread the love