వెంకట్రామరెడ్డి ఘన విజయం ఖాయం: జీడిపల్లి రాంరెడ్డి

నవతెలంగాణ – తొగుట
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి ఘన విజయం ఖాయమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండ లంలోని లింగాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పను ల వద్ద కూలీలకు మజ్జిగ పంపిణీ చేసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అలివి కాని హామీలు ఇచ్చి అమలు చేయ డంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొక్క బోర్లా పడ్డారన్నారు. ఇంటింటికి తాగు నీళ్లు, మల్లన్న సాగర్ ప్రాజెక్టు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, 2 వేల పించిన్, కేసీఆర్ కిట్ లాంటి ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత కేసీ ఆర్ కే దక్కుతుందన్నారు. గ్రామ గ్రామాన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కి ప్రజలం తా మద్దతు పలుకుతున్నారన్నారు.గత ప్రభుత్వం లో అందించిన సంక్షేమ పథకాలు దేశా నికి ఆద ర్శంగా నిలిచాయని అన్నారు. గత ఎన్నికలలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీగా గెలిచిన నెల రోజులలో తన సొంతంగా 100 కోట్ల రూపాయల నిధులతో ట్రస్టు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని అన్నారు. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దని అభివృద్ధి చేసే వారికి తమ యొక్క ఓటు వేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో లింగాపూర్ లో బీఆర్ఎస్ కు ఘన విజ యం అందించారని, ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటా లన్నారు. కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి, గ్రామ పార్టీ అధ్య క్షులు తగరం అశోక్, నాయకులు బిక్కనూరి శ్రీశై లం, గంగి కృష్ణ, నరోత్తం రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చంద్రయ్య, సంతోష్, రామస్వామి, సుతారి రాము లు, జీడిపల్లి స్వామి, యాదగిరి, మల్లేశ్, యేళ్లేం ధర్, శ్రీశైలం, కొమురయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.
Spread the love