రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమ చూపుతుంది

– పీఏసీఎస్ ఛైర్మన్ కె. హరికృష్ణ రెడ్డి.
నవతెలంగాణ – తొగుట

రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమ చూపు తోందని పిఎసిఎస్ చైర్మన్ హరికృష్ణ రెడ్డి అన్నారు. శుక్రవారం మార్కెట్ యార్డులో పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనం తరం ఆయన మాట్లాడుతూ నామమాత్రంగా కొను గోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపిం చారు. కొనుగోలు కేంద్రానికి రైతులు పొద్దుతిరుగు డును తీసుకువచ్చిన కొనుగోలు చేయడంలో అధి కారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కొను గోలు కేంద్రంలో పొద్దు తిరుగుడు నింపడానికి గోనే సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా రని అన్నారు. రోజులు గడుస్తున్న అధికారులు పట్టించుకోక పోవడంతో రైతును తీవ్ర ఇబ్బందుల కు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్ప టికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల నుండి పొద్దుతిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేదంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రానున్న వారం రోజులలో యాసంగి వరి పంట చేతికి వస్తుం దని, వచ్చిన ధాన్యాన్ని మార్కెట్ యార్డులో పోయ డానికి సరైన స్థలం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని సూచించారు. వాతా వరణ శాఖ వచ్చే ఏడు, ఎనిమిది తేదీలలో వర్షాలు పడతాయని తెలపడంతో పొద్దుతిరుగుడు రైతు లు ఆందోళనకు చెందుతున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకొని రైతులను ఆదుకోవాలని కోరారు.

Spread the love