పొద్దు తిరుగుడు కొనుగోలు వేగవంతం చేయకుంటే కలక్టరేట్ ముట్టడిస్తాం

నవతెలంగాణ – తొగుట
పొద్దు తిరుగుడు కొనుగోలు వేగవంతం చేయకుం టే కలక్టరేట్ ముట్టడిస్తామని సొసైటీ చైర్మన్ కన్న య్య గారి హరికృష్ణ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు సిలువేరు మల్లారెడ్డి లు ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన పొద్దు తిరుగుడు కొనుగోలు వేగవంతం చేయాలని తాసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాజమల్లుకు రైతులతో వినతి పత్రాన్ని అందజే శారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దాన్యం కొనుగోలు జాప్యం చేయడం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపిం చారు. గత 15 రోజులుగా పొద్దుతిరుగుడు కొను గోలు నిలిచిపోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని మండి పడ్డారు. రాబోయే రెండు రోజులలో పొద్దుతిరుగు డు కొనుగోలు ప్రారంభించక పోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున కలెక్టరేట్ను ముట్టడిస్తామని ప్రభుత్వా న్ని హెచ్చరించారు. మరో వారం రోజులలో యాసం గి వరి కోతలు ప్రారంభమవుతాయని, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని అన్నా రు. కొనుగోళ్లు ప్రారంభించిన 10 రోజులలో ప్రతి రోజు ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. రెండు రోజులలో ధాన్యం కొనుగోలు ప్రారంభించక పోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత పది రోజులు ధాన్యం కొనుగోలు నడిస్తే అందులో దాదా పు గా 222 మంది రైతుల వద్ద 5500 బ్యాగులలో దాదాపుగా 2700 వందల క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరిత గతిన నిర్ణయం తీసుకొని రైతులను ఆదుకోవాలని కోరారు. రానున్న రెండు మూడు రోజులలో వర్షా లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు ఆందోళనకు గురవుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభు త్వం ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసిం దని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కురుమ యాదగిరి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బక్క కనకయ్య, రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు బోధనం కనకయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బండారు రమేష్ గౌడ్, మంగ యాద గిరి, సంతోష్, నాయకులు మంగ నర్సింలు, వెంక టేశం, యాదగిరి, సుభాష్, బైరారెడ్డి, పబ్బతి వెంకట రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love