బీజేపీ హయాంలో మహిళలపై దాడులు పెరిగాయి: టీ.జ్యోతి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
పది సంవత్సరాల బీజేపీ పాలనలో మహిళల మీద దాడులు పెరిగిపోయి, మహిళలు సాధించుకున్న హక్కులు కాల రాయాలని కుట్ర బీజేనపీ చేస్తుందని ఈ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించి, మహిళా హక్కుల రక్షణ కోసం సీపీఐ(ఎం) పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి జ్యోతి అన్నారు. సోమవారం పంతంగి గ్రామంలో సీపీఐ(ఎం) అభ్యర్థి ప్రచార సభలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వ హయాంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళల మీద దాడులు పెరిగి, నిరంతరం ఎలాంటి దారుణాలు ఎదుర్కోవలసి వస్తుందో మహిళలు భయపడుతూ బ్రతుకుతున్నారని, ప్రధానంగా దేశానికే పేరు తెచ్చే మహిళా రెజ్లర్లను అవమానపరిచిన బ్రిడ్జ్ భూషణ్ సింగ్ ను వదిలేసి, మహిళా రెజ్లర్ల ను అవమానపరిచిన ఘనత బీజేపీకే చెల్లుతుందని అన్నారు. అదేవిధంగా గుజరాత్, యూపీ ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళా హక్కులు హరించబడి కనీసం మౌలిక హక్కులు అడిగే హక్కు లేకుండా చేశారని  అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రతి ఎన్నికల్లో ప్రజలను మోసం చేసే వాగ్దానాలు ఇస్తూ ఓట్లు దండుకుంటున్నారని అన్నారు. కుంట్లగూడెం గ్రామంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ మాట్లాడుతూ నిరంతరం పేద ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న మునుగోడు నియోజకవర్గ సమస్యలను అధ్యయనం చేసిన అనేక పోరాటాలు నడిపిన సీపీఐ(ఎం) పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ కు ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని, ఎర్రజెండా పోరాటాలను మరింత బలపరచాలని  పిలుపునిచ్చారు. వీరితోపాటు నాయకులు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి గంగదేవి సైదులు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, శాఖ కార్యదర్శి అంతటి అశోక్, మండల కార్యదర్శివర్గ సభ్యులు చీరిక సంజీవరెడ్డి, రాగీరు కిష్టయ్య, తడుక మోహన్, బొడిగే లింగస్వామి, గంగదేవి స్వామి, సబిత, కంచర్ల రాజు, జంగిలి కృష్ణ, జంగిలి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love