30 నుండి సాగర్ లో రాష్ట్రస్థాయి నెట్ బాల్ క్రీడా పోటీలు

–  ఈ నెల 30 నుండి 3రోజుల పాటు పోటీలు
నవతెలంగాణ నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ లో రాష్ట్రస్థాయి నెట్ బాల్ క్రీడా పోటీలను ఉమ్మడి నల్గొండ జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా నెట్ బాల్ క్రీడా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం నాడు నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని సెయింట్ జోసెఫ్ పాఠశాల క్రీడా ప్రాంగణం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6వ రాష్ట్రస్థాయి జూనియర్ నెట్ బాల్ పోటీలను ఈనెల 30వ తేదీ నుండి మూడు రోజులు పాటు నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో 22 జిల్లాల నుండి సుమారు 600 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటారన్నారు .సెయింట్ జోసెఫ్ పాఠశాల 1992- 1993 విద్యా సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఈ క్రీడా పోటీల నిర్వహణలో సహకారం అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రస్థాయి నెట్ బాక్ క్రీడా పోటీలను మొదటిసారిగా నాగార్జునసాగర్ లో నిర్వహిస్తున్నామని మూడు రోజులు పాటు సుమారు 600 మంది విద్యార్థులతో నిర్వహించే ఈ క్రీడా పోటీలకు గాను క్రీడాభిమానులు, క్రీడాకారులను ప్రోత్సహించేవారు తమ సలహాలు సూచనలతో పాటు ఆర్థిక సహకారాలని అందించాలని కోరారు. ఈ క్రీడా పోటీలకు ఆర్థిక సహకారం అందించేవారు 9160494743 ఫోన్ నెంబర్ కు సంప్రదించగలరని మనవి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సిస్టర్ అన్నమ్మ, సిస్టర్ ట్రీజ, సిస్టర్ క్లారా, రిటైర్డ్ పి .ఈ. టి అనురాధ, ఉపాధ్యాయులు శివకుమార్, పాఠశాల పూర్వ విద్యార్థులు రాజగోపాల్ రెడ్డి , కరుణాకర్, నినన్, విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love