నా విజయం… ప్రజల విజయం

  • 39 ఏండ్లు చరిత్రను తిరగరాసిన ప్రజలు
  • కుంభం అనిల్ కుమార్ రెడ్డి 
నవతెలంగాణ భూదాన్ పోచంపల్లి: ఈ విజయం ప్రజల విజయం 39 ఏండ్ల చరిత్రను తిరగ రాసినప్రజల మీ ఓటే నా విజయం భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి భువనగిరి చౌరస్తా విజయోత్సవ సభలో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ పోచంపల్లి మండలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ ప్రాంత ప్రజలకు మున్సిపల్ పురపాలక కేంద్రంలో24 గంటల వైద్యం అందించి అంబులెన్స్ ఏర్పాటు ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తాం అన్నారు  పిల్లాయిపల్లి ధర్మ రెడ్డి పల్లె గుర్రపు డొక్కా ఆకులను తొలగించి కాలువల ద్వారా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలతో పాటు కార్మికుల ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పోచంపల్లి మండల ప్రజలకు మిషిని భగీరథ ద్వారా సాగునీరు అందించేందుకు కృషి  పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తామన్నారు.
జూలూరు.. రుద్రవెల్లి బ్రిడ్జి నిర్మాణం, శివారెడ్డి గూడెం దంతూరు బ్రిడ్జి నిర్మాణం, ఇంద్రియాల బ్రిడ్జి నిర్మాణం పనులు చేసేందుకు కృషి చేస్తామన్నారు,దేశ్ముఖ నుండి పిలాయిపల్లి బీటి రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు వెన్నెల మండల పార్టీ అధ్యక్షులు పాక మల్లేశం, తడక వెంకటేశం, సామ మధుసూదన్ రెడ్డి, మరి నరసింహారెడ్డి, రాఘవరెడ్డి, భారత లవ కుమారు, కౌన్సిలర్ భోగభానుమతి, విష్ణు రజిత రాజు, సుజన, మమత, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love