టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ముగ్గురి అరెస్టు

నవతెలంగాణ- హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ముగ్గురు నిందితులను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. భరత్‌ నాయక్‌, పసికంటి రోహిత్‌ కుమార్‌, గాదె సాయి మధులను అరెస్టు చేసినట్టు తెలిపారు. భరత్‌ నాయక్‌ ఉప్పల్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్టు వెల్లడించారు. భరత్‌, రోహిత్‌, సాయిమధు ఈ ముగ్గురూ.. రవికిషోర్‌ నుంచి రూ.లక్షకు ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్టు సిట్‌ దర్యాప్తులో తేలింది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 42కి చేరింది.

Spread the love