నవతెలంగాణ – హైదరాబాద్
తానా నూతన కార్యవర్గం ఎన్నికయ్యింది. ఫౌండేషన్ చైర్మన్‌గా కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన బోస్టన్ ప్రవాసుడు వల్లేపల్లి శశికాంత్, కార్యదర్శిగా న్యూజెర్సీకి చెందిన విద్యాధర్ గారపాటి, సహాయ కోశాధికారిగా అట్లాంటాకు చెందిన గోగినేని కిరణ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారి పదవికి ఖమ్మం జిల్లాకు చెందిన సామినేని రవికి, మద్దినేని వినయ్‌కు ఎన్నిక నిర్వహించగా వినయ్‌కు 8 ఓట్లు, రవికి 6 ఓట్లు లభించాయి. దీంతో, వినయ్ మద్దినేని తానా ఫౌండేషన్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. తానా ఫౌండేషన్ కార్యక్రమాలను విస్తృతిని పెంచేందుకు శాయశక్తులా కృషి చేస్తానని శశికాంత్ పేర్కొన్నారు.