ఐనవోలు అంగడి లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలి

నవతెలంగాణ – ఐనవోలు
మండల కేంద్రంలో ప్రతి బుధవారం అంగడి జరుగుతుంది. ఇక్కడికి పశువులు గోర్లు మేకలు ఎక్కువ వస్తుంటాయి.  జీఎంపీస్ సంఘం ఆధ్వర్యంలో మండల కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు సర్వే నిర్వహించారు. ఇక్కడ అంగడి వేలం పాట 23 లక్షలకు పాడినట్లుగా అధికారులు తెలిపారు. అంగట్లో కనీస  సదుపాయాలు పశువులకు నీటి తొట్లు, రేకుల షెడ్యూలు, మరుగుదొడ్లు లేవు ఇంత ఆదాయం వస్తున్న అంగడిలో కనీస సదుపాయాలు లేకుండా చూస్తున్నారని గ్రామపంచాయతీ కార్యదర్శి పై జీఎంపీస్ మండల ప్రధాన కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు తీవ్రం గా వ్యతిరేకించారు. ఇప్పటికైనా స్పందించి కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.

Spread the love