వర్షం కోసం గ్రామదేవతలకు జలాభిషేకం.

నవతెలంగాణ-గోవిందరావుపేట
వర్షం కోసం మండలంలోని పసర గ్రామపంచాయతీ పరిధిలోగల నేతాజీ నగర్ గ్రామ మహిళలు సోమవారం గ్రామ దేవతలకు  జలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు కావస్తున్న ఇప్పటివరకు చినుకు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి మొక్కలు ఎండిపోతున్నాయి. మరికొన్ని పత్తి గింజలు ఇంకా మొలకెత్తినే లేదు. వరి నార్లు ఇంకా పోసుకునే లేదు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మహిళలు ఐకమత్యంగా అందరూ కలిసి వర్షం కోసం  గ్రామదేవతలైన బొడ్రాయి పోచమ్మ తల్లి ఆంజనేయ స్వామి బంజారాల కులదైవం అయిన చిత్ర భవాని దేవతమూర్తులకు బిందెలతో నీటిని మోసుకు వచ్చి జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పిల్లలు పాల్గొన్నారు గ్రామ పెద్ద భూక్య బద్ధు నాయక్ వార్డు సభ్యులు ధారావత్ అన్నపూర్ణ మరియు కుర్ర శ్రీను మూడు సుగుణ ముఖ్య పులిసి, పున్నం చందర్  తదితరులు పాల్గొన్నారు.
Spread the love