మంత్రి ఎర్రబెల్లికి వీరాభిమాని..

– ఈడీఆర్ హెయిర్ కటింగ్ తో అభిమానం చాటుకున్న ప్రవీణ్
నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పై అభిమానంతో ఓ వీరాభిమాని ఈడీఆర్ హెయిర్ కటింగ్ తో అభిమానం చాటుకున్నారు. మండల కేంద్రానికి చెందిన చెరుకు ప్రవీణ్ మేస్త్రి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు పాఠశాల స్థాయి నుంచే మంత్రి ఎర్రబెల్లి అంటే అమితమైన గౌరవం. పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పని చేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మంత్రి ఎర్రబెల్లిపై ప్రవీణ్ చూపిస్తున్న వీరాభిమానానికి మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ ముగ్ధుడయ్యాడు. ఎర్రబెల్లిపై అభిమానం పట్ల ఆయన ప్రవీణ్ ను అభినందించారు.

Spread the love