ఘనంగా ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

నవతెలంగాణ – ధర్మసాగర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం మండలంలోని ఆయా గ్రామాలలోని గ్రామ సర్పంచులు, అన్ని పార్టీల శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ మర్కాల రజిని, మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎంపీపీ నిమ్మ కవితా రెడ్డి, స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ ఒంటేరు రమేష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గోపీనాథ్, స్థానిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జెండా ఎగరవేసి వందన స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మర్కాల రజిని, ఎంపీపీ నిమ్మ కవిత రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం మేరకు దశాబ్ది ఉత్సవాలను ఈనెల రెండు నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలోనే సంక్షేమ పథకాలలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, దానిని ప్రపంచ స్థాయిలో గుర్తించే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాలలో ఎంపీడీవో జోహార్ రెడ్డి, ఎంపీటీసీలు రోండీ రాజు యాదవ్, కొలిపాక వనమాల, బొడ్డు శోభ, లక్క సునీత, ఉప సర్పంచ్ బొడ్డు అరుణ ఇమాన్, నాయకులు గుర్రపు ప్రసాద్, బొడ్డు లెనిన్, మోట్టే యామిని, కొలిపాక లక్ష్మి, గణేష్, మల్లయ్య, ఏలియా, ప్రవీణ్, మాలోతు దస్రు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love