నవతెలంగాణ – ధర్మసాగర్
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందినా ఘటన శుక్రవారం మండల కేంద్రంలో నేషనల్ హైవే 163 జరిగింది. స్థానిక సీఐ ఒంటేరు రమేష్ తెలిపిన వివరాల ప్రకారం రాంపూర్ శివారులో శుక్రవారం ఉదయం వాకింగ్ వెళ్తున్న గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి ధర్మసాగర్ పోలీసులు చేరుకున్నారు. మృతుని ఒంటిపై తెలుపురంగు చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. వయస్సు 60 సంవత్సరాలు ఉంటుందని, మొఖం గుర్తు పట్టలేనంతగా ఛిద్రమై ఉన్నదని తెలిపారు. రాంపూర్ విఆర్ ఏ రాజకుమార్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్నీ పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎం తరలించి మార్చురీలో భద్రపరిచామని, ఇట్టి వ్యక్తిని గుర్తించినచో పి ఎస్ ధర్మసాగర్
సెల్:8712685010, 8712685010 ఫోన్ చేసి సమాచారం అందించగలరని ఈ సందర్భంగా ఆయన కోరారు.