దేశానికి దిక్సూచి తెలంగాణ రాష్ట్రం

నవతెలంగాణ – చిన్నకోడూరు
భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దిక్సూచిగా ఉందని చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామ ఉపసర్పంచ్ పున్నం సురేష్ అన్నారు. చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామంలో శుక్రవారం ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన అమరుల ఆశయాలు, ఆకాంక్షల సాధనకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామంలో 21 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తామని, ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ బలీయ శక్తిగా తెలంగాణ ఎదిగిందని, తెలంగాణ దృక్పథంతో ప్రభుత్వం విధానాలను రూపొందించుకుందని తెలిపారు. గడిచిన ఈ తొమ్మిదేళ్ళ వ్యవధిలో వాయువేగంతో రాష్ట్రం ప్రగతి శిఖరాలను అధిరోహించిందని, అభివృద్ధిని సాధించడమేకాదు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కూడా రాష్ట్రం నూతన ఒరవడిని దిద్దిందని తెలిపారు. అనివార్య కారణాల వల్ల గ్రామ సర్పంచ్ గాజుల బాబు వేడుకల్లో పాల్గొనలేకపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుంచు జమున ఎల్లయ్య, పంచాయతీ సెక్రెటరీ కాల్వ రేఖ, వార్డు సభ్యులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, భవాని, పద్మ, రాధా, మంజుల, మాజీ సర్పంచ్ ఏలేటి నరసింహారెడ్డి, అరుణ రాజా రెడ్డి, ఏ ఈ ఓ జమీల్, ప్రైమరీ, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఆశాలు, అంగన్వాడీలు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love