సీఎం కేసీఆర్ పంచాయతీ కార్యదర్శులు పాలాభిషేకం 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

జూనియర్ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ  లకావత్ మానస ,జూనియర్ కార్యదర్శులు రాకేష్, శ్రీనివాస్, పృద్వి, శారద, రాజమ్మ, కల్పన ,రాజమ్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love