టీఆర్ఎస్ కెవి నుండి సీఐటీయూలోకి 

– సీఐటీయూ పోరాటాలను ఆకర్షించి అంటున్న ఆశాలు 

నవతెలంగాణ – చిన్నకోడూరు 
సీఐటీయూ పోరాటాలను ఆకర్షించి టీఆర్ఎస్ కెవి నుండి సీఐటీయూలోకి చేరుతున్నట్లు సీఐటీయూ అనుబంధ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.భాస్కర్ అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఆశ వర్కర్స్ టీఆర్ఎస్ కెవి నుండి సిఐటియు లోకి చేరుతున్న సందర్భంగా వారికి కండువాకప్పి స్వాగతం పలికారు. అనంతరం భాస్కర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆశా వర్కర్లకు కనీస గుర్తింపు లేని సందర్భంగా అనేక హక్కులు పోరాడి సాధించిపెట్టిన ఏకైక సంఘం సీఐటీయూ మాత్రమే అని గుర్తు చేశారు. ఆశాలు సీఐటీయూ ఆధ్వర్యంలో చేసిన పోరాటాల ఫలితంగా ఆశ వర్కర్లకు పారితోషకాలు పెరిగాయని గుర్తు చేశారు. కానీ ఈరోజు పిక్స్ వేతనం అమలు చేయాలని చిన్నకోడూరు పరిధిలో టిబి పేషంట్ల(తెమడ) స్పూటo డబ్బాలు ఆశా వర్కర్లతో తెప్పించే విధానం రద్దు చేయాలని కోరారు. ఫిక్స్ డు వేతనం అమలు చేయాలని, ఇతర సమస్యలను పరిష్కారం చేయాలనీ కోరుతూ  ఆగస్టు 23 బుధవారం రోజున సిద్దిపేట కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహిస్తున్నామని ఈ ధర్నాకు చిన్నకోడూరు మండల ఆశా వర్కర్లతో పాటు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంల ఆశ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతిరెడ్డి, ఆశ వర్కర్లు వరలక్ష్మి, నీరజ, సుగుణ, పద్మ, విజయలక్ష్మి, వైడూర్యం, భాగ్యలక్ష్మీ, భార్గవి, శోభ, లలిత, శంకరవ్వ, సంతోష, విజయ తదితరులు పాల్గొన్నారు.
Spread the love