సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
9350 మంది జూనియర్ పంచాయతీ రాజ్ కార్యదర్శులను తెలంగాణ సర్కారు పర్మినెంట్ చేయడం హర్షించదగ్గ విషయమని టీఎన్జీవో పంచాయతీ కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు రఘు రామకృష్ణ, దుబ్బాక మండల జూనియర్ పంచాయతీ సెక్రటరీ సంఘం అధ్యక్షులు పూర్ణ చందర్,పంచాయతీ జనరల్ సెక్రటరీ(కార్యదర్శి)మల్లేశం అన్నారు.మంగళవారం దుబ్బాకలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి పంచాయతీ సెక్రటరీ లు పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామ పంచాయితీ అభివృద్ధిలో మరింత ఉత్సాహంతో పని చేస్తామన్నారు.  సీఎం కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ఎంపీవో నరేందర్ రెడ్డి ,ఎంపీడీఓ భాస్కర శర్మ లను జూనియర్ పంచాయతీ సెక్రెటరీలు వారిని శాలువాతో సత్కరించి… స్వీట్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో సీనియర్ పంచాయతీ సెక్రెటరీలు వజ్రమ్మ, మల్లేశం, శ్రీనివాస్, దుబ్బాక మండల జూనియర్ పంచాయతీ సెక్రటరీల అధ్యక్షుడు పూర్ణచందర్, కార్యదర్శి మల్లేశం,జూనియర్లు శిరీష్, బాలు, స్వాతి, చంద్రం, శృతి, సునీత తదితరులు ఉన్నారు

Spread the love