సైబర్‌ సెక్యూరిటీ, ప్రైవసీ కాన్ఫరెన్స్‌

నవతెలంగాణ – సిటీబ్యూరో
డీఎస్‌సీఐ సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, తెలంగాణ, హైదరాబాద్‌లో సైబర్‌ సెక్యూరిటీ, ప్రైవసీ కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. సైబర్‌ సెక్యురిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, తెలంగాణ సీఈఓ డాక్టర్‌ శ్రీరామ్‌ బిరుదవోలు చేసిన ఈ మార్గదర్శక ప్రయత్నం ప్రభుత్వ శాఖలకు సైబర్‌-దాడులను గురించి అవగాహన కల్పించడం, వాటిని ఎదుర్కోవడానికి వ్యూహాన్ని అభివద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీఈ అండ్‌ సీ, పరిశ్రమలు అండ్‌ వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జయేష్‌ రంజన్‌ సహా తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి విశిష్ట అతిథులు ఈ సదస్సుకు హాజరయ్యారు. గౌరవ అతిథిగా ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ డైరెక్టర్‌ రమాదేవి లంక, వేణు ప్రసాద్‌, జాయింట్‌ డైరెక్టర్‌ (ఇన్‌ఫ్రా అండ్‌ కమ్యూనికేషన్స్‌) కాన్ఫరెన్స్‌కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. డీఎస్‌సీఐ సీఈఓ వినాయక్‌ గాడ్సే, నాస్కామ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ శ్రీనివాసన్‌ వంటి పరిశ్రమ ప్రముఖులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి 30కు పైగా శాఖలకు చెందిన 200 మంది ప్రభుత్వ ప్రతినిధులు హాజరయ్యారు.

Spread the love