సికింద్రాబాద్‌ ఊర్వశి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ లైసెన్స్‌ రద్దు

నవతెలంగాణ-హైదరాబాద్ : సికింద్రాబాద్‌ ఊర్వశి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఊహించని షాక్ తగిలింది. సికింద్రాబాద్‌ ఊర్వశి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ లైసెన్స్‌ రద్దు అధికారులు. ఊర్వశి బార్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్నారనే పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. 30 మంది అమ్మాయిలతో పాటు 70 మంది కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యాజమాన్యం బార్‌లో అమ్మాయిలతో నృత్యాలను చేయిస్తున్నారు. దీంతో యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు బార్‌ లైసెన్స్‌ను రద్దు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love