మళ్లీ షాకిచ్చిన బంగారం..

నవతెలంగాణ-హైదరాబాద్ : పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. నెల రోజుల వ్యవధిలో భారీగా పెరిగిన బంగారం రేటు ప్రస్తుతం వారం రోజులుగా కాస్త తగ్గుతున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న ఏప్రిల్ 23న గోల్డ్ ధర తులంపై రూ. 1500 కుపైగా తగ్గింది. అంతకుముందు రోజు కూడా రూ. 500 పతనమైంది. అయితే తర్వాత మళ్లీ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఏప్రిల్ 24న పెరిగిన బంగారం ధర.. మళ్లీ మరుసటి రోజు దిగొచ్చింది. ఆ తర్వాత తగ్గుతుందనుకుంటే మళ్లీ పెరిగి షాకిచ్చింది. దేశీయంగా గోల్డ్ రేట్లు చూస్తే.. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 400 పెరిగి తులానికి రూ. 66,650 వద్ద ఉంది. కిందటి రోజు ఇది రూ. 350 తగ్గింది. ఇదే 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం రేటు విషయానికి వస్తే ఇది రూ. 440 ఎగబాకి 10 గ్రాములకు రూ. 72,710 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర రూ. 400 పెరిగి 22 క్యారెట్స్‌పై తులానికి రూ. 66,800 వద్ద ఉండగా.. 24 క్యారెట్స్ బంగారం రేటు రూ. 440 పెరిగి ప్రస్తుతం 10 గ్రాములు రూ. 72,860 పలుకుతోంది

Spread the love