సొసైటీ భవన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ కి ఆహ్వానం

నవతెలంగాణ – నవీపేట్: బినోల సొసైటీ నూతన భవన ప్రారంభోత్సవానికి చైర్మన్ మగ్గరి హన్మాన్లు హైదరాబాదులోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మంగళవారం ఆహ్వానించారు. ఈనెల 25 తర్వాత ప్రారంభోత్సవానికి తేదీ ఖరారు చేయనున్నట్లు, ఎమ్మెల్యే షకీల్ కు సైతం ఆహ్వానించినట్లు చైర్మన్ హన్మాన్లు తెలిపారు. ఆయన వెంట డైరెక్టర్ విజయ్ ఉన్నారు.
Spread the love