వృద్ద దంపతులకు ప్రజా సేవ సైన్యం సహకారం

నవతెలంగాణ- నిజామాబాద్ సిటీ 

వయసు పైబడి, ఉపాధి చేసుకోలేక, ఆరోగ్యం సహకరించక, వయసు మీద పడడంతో ఎటువంటి ఉపాధి పొందలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ జీవనం కొనసాగిస్తు, వృద్ధులు కావడంతో వారికి ఎటువంటి సహకారం అందకపోవడంతో ప్రజాసేవ సైన్యం వారికి అండగా ఉంటూ సహకారం అందించింది. ప్రజా సేవ సైన్యం నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని కోటగల్లి బంగారు మైసమ్మ సమీపంలో 70 సంవత్సరల పైబడిన ఇద్దరు వృద్ద దంపతులు వల్లకాటి కిషన్, వల్లకాటి సుభద్ర లు ఎన్నో సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. కిషను కు రెండుసార్లు ఆపరేషన్లు చేయించుకున్నారు, వారికి స్వంత స్థిరాస్తులాంటు ఏమీ లేవు అని, మొన్నటి వరకు కుటుంబ సభ్యులు కూతురు, బంధువులు వీరికి ఎంతోకొంత తోచిన సహాయం చేశారు. ఇప్పుడు ఎవరి సంసార బాధ్యతలు వారికి ఉన్నాయంటూ ఆర్థిక భారం కావడం తో ఎలాంటి సహాయం అందకపోవడం. వారిలో ఒకరికి పింఛను డబ్బులు 2016 రూపాయలు వస్తున్నాయి అవి రూమ్ కిరాయి(1500), కరెంటు బిల్లు కే సరిపోవడం తో వారి తమ్ముడు శ్రీహరి, ప్రజా సేవ సైన్యం వ్యవస్థాపకుడు విఠల్ ను సంప్రదించగా సేవా సంస్థ నుండి వెంటనే స్పందించిన విఠల్ వారి జీవన నిమిత్తం వంట చేసుకొనుటకు గ్యాస్ సిలిండర్, 25 కేజీ ల బియ్యం, పప్పులు, నూనె, నిత్యవసరాల సర్కులను వారికి అందించారు.

Spread the love