నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఖండేభల్లూర్ జీప పరిదిలో సిసి రోడు పనులను బీఆర్ఎస్ నాయకులు స్థానిక సర్పంచ్ మహనంద తో కలిసి ప్రారంభించారు. ఈ సంధర్భంగా బీఆర్ఎస్ సీనీయర్ నాయకుడు నీలుపటేల్ మాట్లాడుతు మండలంలో ఇప్పడికే పలు గ్రామాలో అత్యవసరం ఉన్న చోట పార్టీలకు అతీతంగా గ్రామగ్రామాలకు సిసి రోడ్లు మంజూరు చేసి పూర్తీ చేసామని తెలిపారు. గ్రామాలలో ఎక్కడ చూసిన రోడ్లు, మురికి కాలువలు, పచ్చటి హరితహరం చెట్లు, జలకళతో చెరువులు కుంటలు నిండి ఉండటం, వలన గ్రామాల రూపు రేఖలు మారయని పేర్కోన్నారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ విరేశం, విండోచైర్మేన్ శివానంద్, మాజీవిండో చైర్మేన్ రాజుపటేల్, మాజీ ఎంపిపి శెట్కార్ బస్వంత్ పటేల్, బీఆర్ఎస్ నాయకుడు నీలుపటేల్, శివరాజ్ దేశాయి, సాయులు, తదితరులు పాల్గోన్నారు.