నవతెలంగాణ – సోఫియాన్: ముంబై రంజీ, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పెండ్లి చేసుకున్నాడు. కశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాకు చెందిన అమ్మాయితో అతని వివాహమైంది. సర్ఫరాజ్ పెండ్లి వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. పెండ్లి కూతురుతో దిగిన ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశాడు సర్ఫరాజ్ ఖాన్. క్రికెటర్లు క్రిస్ గేల్, సూర్యకుమార్ యాదవ్‌లు అతనికి విషెస్ తెలిపారు. విండీస్ టూరులో ఉన్న అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, రుతురాజ్ గైక్వాడ్‌లు కూడా అభినందలు చెప్పారు. 25 ఏళ్ల సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత రికార్డుతో కొనసాగుతున్నాడు. 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతను 3559 రన్స్ చేశాడు. దాంట్లో 13 సెంచరీలు ఉన్నాయి. 301 రన్స్ అతని హయ్యస్ట్ స్కోర్. అతని బ్యాటింగ్ యావరేజ్ 74.14. బ్లాక్ కలర్ షేర్వాణి వేసుకున్న సర్ఫరాజ్.. కశ్మీర్ అమ్మాయిని చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. అయితే విండీస్ టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల బీసీసీఐ సెలెక్టర్లపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. గత మూడు సీజన్ల నుంచి సర్ఫరాజ్ 100 యావరేజ్‌తో స్కోరింగ్ చేస్తున్నాడు.