నాగపూర్ డివిజన్‌లో 15 స్టేషన్లకు మోడీ శంకుస్థాపన

నవతెలంగాణ – ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాగపూర్‌ డివిజన్‌లోని 15 స్టేషన్లకు ఆదివారం మధ్యాహ్నం 11 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్లుగా వీటిని తీర్చిదిద్దనున్నారు. ఇదొక అపూరుప సందర్భమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఒక ట్వీట్‌లో తెలిపారు. రూ.372 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్న 15 స్టేషన్లలో బలార్షా, బెటుల, చంద్రపూర్, సేవాగ్రామ్, పుల్‌గావ్, ధర్మన్‌గావ్, అమ్లా, నార్ఖేర్, కటోల్, పాందుర్నా, జున్నర్‌దేవ్, హింగన్‌ఘాట్, ముల్టాయ్, ఘోరడోంగ్రి, గోధాని ఉన్నాయని చెప్పారు. అమృత్ భారత్ స్కీమ్ ద్వారా ఈ స్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపరచనున్నారని, వెయిటింగ్ హాల్స్, వైఫై, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే దుకాణాలు వంటివి ఇందులో ఉంటాయని గడ్కరి తెలిపారు. మౌలిక వసతులు, కనెక్టివిటీ ద్వారా వైబ్రంట్ నాగపూర్ రూపకల్పనకు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తీసుకుంటున్న చొరవను ఆయన ప్రశంసించారు. కాగా, 15 స్టేషన్లకు శంకుస్థాపన చేయడంతో పాటు, 508 రైల్వే ప్రాజెక్టుల పునరావృద్ధికి కూడా ప్రధాని మోడీ ఆదివారంనాడు శంకుస్థాపన చేయనున్నట్టు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. భారత రైల్వేల్లో సమూల మార్పులు తీసుకురావాలనే మోదీ విజన్ ప్రశంసనీయమని అన్నారు.

Spread the love