మెంట్రాజ్ పల్లి లో వివాహిత ఆత్మహత్య…

– అత్తింటి వేధింపులే కారణం.. బందువులు..
– ఇంటిపై దాడి.. ఆందోళన..
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని  మెంట్రాజ్ పల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో యువతి మగ్గిడి లలిత (24) ఇంట్లో ఫ్యాన్ కు ఉరీ వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐయు మహేష్, మృతురాలి బంధువులు తెలిపారు.వారు తెలిపిన వివరాల ప్రకారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్ పుర్ గ్రామానికి చెందిన (గ్రామంలో పేరు స్వప్న) మగ్గిడి లలితతో మండలంలోని మెంట్రాజ్ పల్లి గ్రామానికి చెందిన వినోద్ తో గత ఐదేళ్ల క్రితం కట్న కానుకలు ఇచ్చి, పూర్తి లంచనాలతో ఘనంగా పెండ్లి జరిపించారు.కోన్నేళ్ళ పాటు వీరి సంసారం సజావుగా సాగుతున్న తరుణంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి.గతేడాది నుండి స్వప్నను తన భర్త, అత్త,మామలు కలిసి వేధింపులకు, మనోవేదనకు గురి చేస్తుండే వారని మృతురాలి కుటుంబ సభ్యులు ఘన్ పుర్ గ్రామంలో ఆరోపించారు. కుటుంబ కలహాలు జరగకుండా ఇరువురి బంధువుల మధ్య భార్యా భర్తలు ఒప్పందం చేసి కాపురం సజావుగా చేసుకోవాలని ఒప్పించారు. గత కొంత కాలంగా స్వప్న భర్త వినోద్, అత్త, మామ కలిసి వేధిస్తున్నారని శుక్రవారం రాత్రి మెంట్రాజ్ పల్లిలోని నివాస గృహంలో స్వప్న సిలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని విషయం తెలుసుకున్న స్వప్న బంధువులు గ్రామానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం చేయకుండా అడ్డుకొని ఆందోళన చేశారు. అత్తింటి వారి వేధింపుల వల్లే స్వప్న ఆత్మహత్యకు పాల్పడిందని వారు ఆరోపించారు. మృతురాలి బంధువులు కోపంతో వినోద్ ఇంటిపై దాడి చేశారు. తమ అమ్మాయికి అన్యాయం జరిగిందని అత్తింటి వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందని వేధింపులకు పాల్పడ్డ భర్త వినోద్ అత్త,మామలను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా వారిని శిక్షించాలని కుటుంబ సభ్యులు, బందువులు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్  కృష్ణ గ్రామానికి చేరుకొనిచ మృతురాలి కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని మార్చురీకి తరలించారు.మృతురాలి పెద్దనాన్న సింగరి అబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Spread the love