జిపి కార్మికులకు ఇచ్చిన హామీ ఏమైంది..

నవతెలంగాణ – డిచ్ పల్లి
గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీ ఏమైందని, రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కృషి చేసి సహకరించి, సిబ్బంది న్యాయమైన డిమాండ్ లను నేరవేర్చే విధంగా ముఖ్యమంత్రి చోరవ చూపలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నుర్జహన్ డిమాండ్ చేశారు. గురువారం న్యాయమైన డిమాండ్ ల సాధనకై గ్రామ పంచాయతీ సిబ్బంది నిరవధిక సమ్మె శిబిరం సందర్శించారు.  ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ట్రేజరీల ద్వారా వేతనాలు 12 పి.ఆర్.సి.లో నిర్ణయించిన కమినిషన్ చేసి రూ. 19, వేతనంగా చెల్లించాలని, ఆ లోపు జీవో నెం.60 ప్రకారం స్వీపర్లకు 15,500 ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ. 19,500/-లు నిర్ణయించా లన్నారు. 31 కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయక కార్యదర్శులుగా నియమించాలని,జివో నెం.310 సవరించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, పాత కేటగిరీలన్నింటినీ  యధావిధిగా కొనసాగించే విధంగా చూడాలని అయన సూచించారు.విధి నిర్వహణలో ప్రమాదం జరిగి మృతి చెందిన సిబ్బంది కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వమే ఇవ్వాలని, పోస్టాఫీస్ బీమా పథకం ద్వారా చెల్లించాలని, ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సహజ మరణానికి ఇన్సూరెన్స్ పథకాన్ని రూ.5 లక్షలకు పెంచాలన్నారు.  పంచాయితీలలో ఆదాయమున్న చోట వేతనాల పెంపుకు అనుమతినివ్వాలని, వేతనాలు పెంచాలని, 2011 జనాభా ప్రకారం కాకుండా  ప్రాతిపదికన కార్మికుల్ని తీసుకోవాలని, ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ పి.ఎఫ్.ఈ.ఎస్.ఐ ప్రమాద బీమా, గ్రాట్యూటీ, గుర్తింపు కార్డులు, ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుని దహన సంస్కారాలకు 30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని,8 గంటల పని దినాన్ని అమలు చేయాలని, వారాంతపు సెలవులు, పండుగ సెలవులు, జాతీయ ఆర్జిత సెలవు దినాలను అమలుచేయాలని, తెలిపారు. 121. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ సిబ్బందికి అన్ని కార్మిక చట్టాలు అమలు చేయాలని,121 వివిధ పంచాయతీలలో కొత్తగా నియమించిన వారికి సంబంధించి గ్రామపంచాయతీ తీర్మాణం చేయాలి. డిపిఅర్ ఓ అనుమతి తరువాత నియమాకలు జరగాలన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లకు పంచాయతీల ద్వారానే డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పించాలని, వయస్సు మీరిందనే సాకుతో కార్మికులను మార్చితే ఆ కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించాలని,రిటైర్మెంట్ బెనిఫిటీగా రూ.5 లక్షలు ఇవ్వాలని, సంవత్సరానికి మూడు జతల యూనిఫామ్, సరిపడా చెప్పులు, సబ్బులు, నూనెలు ఇవ్వాలని, వాటిని నగదు రూపంలో అలవెన్స్డ్ గా చెల్లించాలని పేర్కొన్నారు. కార్మికులపై వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని,పై డిమాండ్ల పరిష్కరం కోసం జెఎసి ప్రతినిధులతో వెంటనే జాయింట్ మీటింగ్ ఏర్పటు చేసి సమస్యను పరిష్కరించి తోడ్పాటు అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ జిల్లా సహాయ కార్యదర్శి నన్నే సాబ్ ఏరియా నాయకులు గ్రామపంచాయతీ జిల్లా అధ్యక్షులు రాజేష్,మండల అధ్యక్షులు మ్యాదరి గంగారాం తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love