సంక్షేమానికి చిరునామా కేసీఆర్..

నవతెలంగాణ – డిచ్ పల్లి
సంక్షేమానికి, అభివృద్ధి కి చిరునామా కెసిఆర్ అని, అయన ఆలోచనలకు కంటి వెలుగు నిదర్శనమని, ప్రజలంతా నా వాళ్ళని ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, బిజెపి, కాంగ్రెస్ లకు సంక్షేమం అభివృద్ధి తెలియదని, వారికి సోషల్ మీడియా వాట్సప్ లలో ప్రచారాలు చేసుకోవడమే తెలుసని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వారిచ్చిన పెన్షన్ ఎంగిలి మెతుకులాంటిదని రోజురోజుకు బీడీ పరిశ్రమ మూతపడుతుందని, దీనిపై లక్షలాదిమంది ఆధారపడి జిల్లాలో ఉన్నారని వారికి కొండంత ధైర్యం ఇచ్చి ఆదుకోవడానికి బీడీ కార్మికులందరికీ పెన్షన్ అందజేస్తూ దేశంలో 14 ,15 రాష్ట్రాలలో ఈ పరిశ్రమ ఉన్న అక్కడి ప్రభుత్వాలు కార్మికులకు పెన్షన్ ఇచ్చింది ఏమీ లేదని ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారండిచ్ పల్లి మండల కేంద్రంలోని జీ కన్వేన్ షన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీఎస్ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఎంబీసీ కులాల్లో చేతివృత్తుల వారిని గుర్తించి వారికి లక్ష రూపాయలను అందజేస్తున్నామని త్వరలో ఇతర వారికి అందజేసే విధంగా కెసిఆర్ ఆలోచన చేస్తున్నారని అది కూడా త్వరలో కార్యరూపం దాల్చుతుందన్నారు. సంక్షేమం అటే ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ వారికి సహాయం చేయడం ఒక్క రూపాయి వచ్చిన అది సంక్షేమమే నని, వృద్ధులు వితంతువులు వికలాంగులు ఒంటరి మహిళలు నేతన్న నేతన్నలు గౌడ అన్నల తోపాటు, కేసీఆర్ ప్రభుత్వం మహిళ బాధలను అర్ధం చేసుకుని ఓంటరి మహిళలకు ఆసరాగా నిలబడిందని వివరించారు. బోదకాలు, డయాలసిస్ తో బాధపడే వారిని గుర్తించి వారికి కూడా ప్రతినెల పెన్షన్ అందజేస్తూన్నమని, ఇదే కాకుండా గతంలో డయాలసిస్ బారిన పడి హైదరాబాద్ కు వెళ్ళవలసి వస్తుండేనని నేడు రాష్ట్రంలోని 33 జిల్లాలో డయలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మధ్యప్రదేశ్ మహారాష్ట్రలలో తోపాటు ఇతర రాష్ట్రాల నుండి పార్టీలో చేరుతున్నారని ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పథకాలను ప్రధానమంత్రి అయితే దేశం నలుమూలల విస్తరిస్తారని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారని కవిత వివరించారు. ఈ నెల నుండి గుర్రాల లక్ష్మి కింద మూడు లక్షల రూపాయలను అందజేస్తామని అసలు భూమి లేని వారిని గుర్తించి ఎమ్మెల్యేలు గ్రామాలలో ప్రభుత్వ భూములు ఉంటే వాటిలో ప్లాట్లు కేటాయించే విధంగా ముఖ్యమంత్రి ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసినట్లు కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరు అడగకముందే ప్రజల కోసం కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించి నేడు లక్షలాదిమంది ఉచితంగా పరీక్షలు చేయించుకుంటూ అవసరం ఉన్నవారికి అద్దాలను అందజేస్తున్నామని కాంగ్రెస్ బిజెపి వారిని కంటి వెలుగు శిబిరాలకు రప్పించి పరీక్షలు చేసే విధంగా చూడాలని నవ్వుతూ పేర్కొన్నారు.
సంక్షేమనికి స్వర్గం చేసి చూపించిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు.అనంతరం ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో, లక్షమంది బీడీ కార్మికులకు పెన్షన్ పంపిణీ చేసిన ఘనత కవితకు దక్కుతుందని వివరించారు.రాష్ట్రంలో మొత్తం 60 లక్షల మంది పిల్లలు చదువుతున్నారని, ఒక్కొక్కరికి వారానికి చికెన్ కోడిగుడ్లు, పౌష్టిక ఆహారం, చదువుకోవడానికి బుక్స్ షూలు, బట్టలు ఒక్కొక్కరికి ఏడాదికి ₹ 1,25,000 రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.రాష్ట్ర ప్రజలు బాగుండాలని ప్రజలంతా నా వాళ్ళు అని ఆలోచించే వ్యక్తి కెసిఆర్ అన్నారు. అవ్వ పింఛన్ ఎంత వస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి పెద్ద కొడుకుగా, అన్నగా ఒక మేనమామగా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న, ఎవడో ఒకడు బిజెపి నాయకులు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు, కేటీఆర్ పై ఆ బాండలు వేస్తుంటరని, కేసీఆర్ అప్పులు చేస్తున్నారని ఆ బాండాలు వేస్తున్నారని, రాష్ట్రం నాలుగు లక్షల కోట్ల అప్పు చేసింది వాస్తవమని,అ అప్పు 80 వేల కోట్ల రూపాయలతో కాలేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, సాగునీటి కోసం 25 వేల కోట్లు ఖర్చు చేశామని, ఇదే కాకుండ పెన్షన్స్, కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు భీమా, ముఖ్యమంత్రి సహాయనిధి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రోడ్లు, ఇవన్నీ చేయడం వల్ల నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు.,దీని అప్పు మనం తీరుస్తున్నామని, అప్పులు బ్యాంకులో కడుతున్నామని కాని ఎగబెడతలేమని, కానీ ఎవరైతే బిజెపి నాయకులు అంటారో కెసిఆర్ కేటీఆర్ అప్పులు చేస్తున్నారని, నేను అడుగుతున్నాను వాళ్లని, దేశ ప్రధాని మోడీ దేశానికి ఏం చేయకుండా, 100 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. అప్పు చేసి మరి ఏం చేశాడని, ప్రజలకు చేసింది శూన్యమన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, కానీ బిజెపి ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకం అయినా ప్రజలకు అందిస్తుందా…? ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేస్తూ, ప్రైవేటు సంస్థలకు అమ్ముతూ, దేశాన్ని అప్పుల మయంగా మార్చిన ఘనత దేశ ప్రధాని మోధీ కే చెందుతుందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఇచ్చే 30 వేల కోట్లు ఇవ్వడం లేదని, కానీ ప్రొద్దున లేస్తే బిజెపి, కాంగ్రెస్ నాయకులు కేసిఆర్ పై కేటీఆర్ పై అబాండాలు వేస్తుంటారని పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు పోందుతు, అబండాలు వేస్తున్నరని, మల్ల ఎవరీమన్నారోయ్, ఇది బిజెపి కాంగ్రెస్ వాళ్ళ తీరన్నారు. ఇకనైనా ప్రజలు గమనించి రాబోయే ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు ఆయన సూచించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబరాల్లో పాల్గొని,గొల్ల, కుర్మ లబ్దిదారులకు “గొర్రెల పెంపక అభివృద్ధి పథకం రెండో విడత భాగంలో 75 శాతం సబ్సిడీతో నేడు గొర్రెల యూనిట్ల పంపిణీ, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, బీసీ కార్పొరేషన్, కులాంతర వివాహ లబ్ధిదారులకు చెక్కులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి పంపిణీ చేశారు. నిజామాబాదు రూరల్ నియోజక వర్గంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాలలో సంక్షేమ సంబురాల్లో భాగంగా రెండవ దశ గొర్రెల యూనిట్ల పంపిణీని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ లతో కలిసి గొర్రెల పెంపక అభివృద్ధి పథకం రెండో విడత భాగంలో 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లప్రారంబంచి 6 గొర్రెల యూనిట్లు ( యూనిట్ 20 గొర్రెలు 1 పొట్టేలు విలువ రూ 1లక్ష .75 వేలు /యూనిట్) పంపిణీ చేపట్టారు. జిల్లాలో అన్ని నియోజక వర్గాలలో కలిపి మొత్తం 31 యూనిట్లు లబ్దిదారులకు అందచేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువ నాయకులు, జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు, ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్, ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, అన్ని మండలాలకు చెందిన ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, జడ్పిటిసిలు సుమన రవి రెడ్డి,దాసరి ఇందిరా లక్ష్మి నర్సయ్య, అర్డిఓ రవి, తహసిల్దార్లు శ్రీనివాస్ రావు, టి వి రోజా, ఎంపిడిఓ రాములు నాయక్, గోపి బాబు,చిలువెరి గంగా దాస్, శ్రీనివాస్ రెడ్డి, శక్కరి కోండ కృష్ణ,కో ఆప్షన్ సభ్యులు షేక్ హుస్సేన్, షేక్ నయీమ్, బుల్లేట్ అక్బర్,అక్బర్, అమేర్ ఖాన్, లోలం సత్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు సొసైటీ చైర్మన్లు గజవడ జైపాల్,చింతలపల్లి గోవర్దన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love