సామాజిక సేవే కేఆర్ఆర్ ఫౌండేషన్ లక్ష్యం

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
రోడ్డు ప్రమాదాల భారీ నుండి ద్విచక్ర వాహనదారులను హెల్మెట్ రక్షిస్తోందని, రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు హెల్మెట్ ని తప్పనిసరి ధరించి ప్రయాణం కొనసాగించాలని కేఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గంభీర్పూర్ గ్రామంలో కేఆర్ఆర్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు ,యువతకు (సుమారు 300 మందికి) ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజసేవే తన లక్ష్యంగా చేసుకుని దుబ్బాక మండలంలో కేఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపించామన్నారు. అందులో భాగంగానే ప్రజలకు సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు నేడు మండల వ్యాప్తంగా యువతకు ద్విచక్ర వాహదారులందరికీ ఉచితంగా హెల్మెట్ల పంపిణీ చేస్తున్నామన్నారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రతి ప్రయాణికుడు బాధ్యతాయుతంగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా వారి ప్రాణాలను రక్షించుకోవాలని ఆకాంక్షించారు. అంతకుముందు రోడ్డు ప్రమాదాలపై గ్రామస్తులకు, యువతకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాణాల శ్రీనివాస్, గంభీర్పూర్ గ్రామ సర్పంచ్ కరికే భాస్కర్, రఘోత్తంపల్లి గ్రామ సర్పంచ్ రెడ్డి దేవిరెడ్డి, కేఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు తొగుట అనిల్, పలువురు పాల్గొన్నారు.

Spread the love