సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం చేస్తాం..

– 8వ రోజుకు చేరుకున్న జిపి కార్మికుల సమ్మె
– (ఐద్వా)అఖీల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగిరెడ్డి నవీన మద్దతు
నవతెలంగాణ- దుబ్బాక రూరల్
ఎనిమిది రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేస్తుంటే వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని (ఐద్వా)అఖీల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగిరెడ్డి నవీన అన్నారు. దుబ్బాక మండల కేంద్రంలో జిపి కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరిన సందర్భంగా గురువారం వారికి ఆమె మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా  మీడియాతో మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కార్మికులను విధుల్లోకి చేరాలని అధికారులు వేధింపులు గురిచేయడం ఆపాలన్నారు. జీవో నంబర్ 51 నీ రద్ద చేయాలని, జీవో 60 ప్రకారం కార్మికుల డిమాండ్లను తీర్చాలని కోరారు. సమస్యలు తీరని ఎడల సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో జిపిల నుండే ప్రభుత్వానికి చరణ గీతం పాడే సమయం ఆసన్నమైందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు శ్రీనివాస్, ప్రశాంత్, రవి, రాకేష్, రాజవ్వ, దుర్గవ్వ, శ్యామల తదితరులు పాల్గొన్నారు.
Spread the love