– విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని పద్మనాభునిపల్లి సర్పంచ్ కండ్లకొయ పర్శరాములు అన్నారు. దుబ్బాక మండల పరిధిలోని పద్మనాభునిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ పర్షారాములు మాట్లాడతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకే ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులను తీర్చిదిద్ది , అన్నిరకాల హంగులతో వసతులను కల్పించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలున్న ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల్ని తల్లిదండ్రులు చేర్పించాలని సూచించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు జానకీ రామ్ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ.. మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.