ఉత్సవాల పేరిట 2 వేల కోట్లు దుర్వినియోగం

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట 2 వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లాకార్యదర్శి ఏలూరి కమలాకర్ ఆరోపించారు. తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ అంటూ శుక్రవారం అక్బరుపేట భూంపల్లి మండల కేంద్రంలో సోనియాగాంధీ తెలంగాణ ప్రకటించి నేటికి 9 ఏళ్ళు పూర్తైన సందర్భంగా వారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణ పూర్తిగా కుటుంబ పాలన, స్వలాభాలకే పరిమితమైందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 16 వేల కోట్లు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పటిగా సీఎం కేసీఆర్ మార్చారని ఆరోపించారు. హైదరాబాద్ శివారు భూములను అమ్మడంలో ఉన్న ధ్యాస తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై లేదన్నారు. రైతులకు రుణమాఫీ, నిరుద్యోగ హామీ, రైతు రుణాలను పట్టించుకోకుండా పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ని తరిమికొట్టడానికి ప్రజలు చూస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రతి ఒక్క హామీ నెరవేస్తుందని తెలిపారు. తెలంగాణకు ఏం చేశారని దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారని ప్రశ్నించారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకుడు అక్కపల్లి బాలనర్సా గౌడ్, బోయిని పర్శారాములు,పోతారెడ్డిపేట్ గ్రామా అధ్యక్షుడు మ్యాదరి కిషోర్, ద్యావర మహిపాల్ యాదవ్ తదితరులు ఉన్నారు.

Spread the love