అంగరంగ వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – గాంధారి
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని గాంధారి మండలంలోని అన్ని గ్రామాల్లో అన్ని తండాల్లో మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయంలో మరియు కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాధా బలరాం, జెడ్పిటిసి శంకర్ నాయక్, సొసైటీ చైర్మన్ సాయికుమార్, గాంధారి సర్పంచ్ ముమ్మాయి సంజీవ్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ సత్యం రావు, ఏ ఏం సి వైస్ చైర్మన్ రెడ్డి రాజు, వైస్ ఎంపీపీ భజన్ లాల్, తాసిల్దార్ గోవర్ధన్, ఎంపీడీవో సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love