నవతెలంగాణ – కంటేశ్వర్
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాదు జిల్లా శాఖ కార్యాలయంలో జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు చేతుల మీదుగా ప్రొఫెసర్ జయ శంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి,జాతీయ పతాకం ఆవిష్కరించి,తదుపరి రక్త దానాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోరాటానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని దీని కోసం ఎంతో మంది వీరులు ప్రాణాలు సైతం లెక్క చెయ్యక బలిదానం అయ్యారని,వారి త్యాగాలే ఇప్పటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమని, ఇంకా విద్యార్థులు,వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, కులసంఘాలు, న్యాయవాదులే కాక వివిధ రంగాల ప్రజల కృషి ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, సెక్రటరీ అరుణ్ బాబు, అసిస్టెంట్ సెక్రటరీ పోచయ్య , పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.