10 సంవత్సరాలలోఅభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు

– ఏది ఏమైనా ఇంటింటికి నీళ్లు ఇవ్వాల్సిందే
– హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలలో ముందుకు వెళ్తున్నామని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ లో ఎంపీపీ లకావత్ మానస అధ్యక్షతన మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ వివిధ శాఖల పై అభివృద్ధి పనుల తీరుపై చర్చించారు. పోతారం ఎస్ గ్రామంలో మిషన్ భగీరథ నీరు రావడంలేదని ఎంపీటీసీ శ్రీనివాస్ మిషన్ భగీరథ ఇంట్రా డీఈఈ రుహీనా తస్కీన్ ని నిలదీశాడు. మిషన్ భగీరథలో నీటి సమస్య పరిష్కరించడంలో డిఈఈ పట్టించుకోవడం లేదన్నారు. దీంతో ఎమ్మెల్యే సతీష్ కుమార్ డి ఈ ఈ పై అగ్రహ వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్న వెంటనే పరిష్కరించాలని, పోతారంలో మిషన్ భగీరథ నీటి సమస్య ఉండడం ఏంటని మండి పడ్డారు. ఎక్కడ లేని సమస్య పోతారం గ్రామంలోనే ఎందుకు వచ్చిందని, గ్రామంలో ఎలాంటి సమస్యనైన పరిష్కరించేందుకు అవసరమైన నిధులు వెంటనే ఇస్తామన్నారు. రేపటిలోగా సమస్య పరిష్కారం కోసం గ్రామానికి వెళ్లి పనులు చేయించాలని డిఈ ఈ నీ ఆదేశించారు. ఎక్కడ కూడా నీటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. హుస్నాబాద్ మండలంలో 3 ఎంపీటీసి పరిధి గ్రామాలను కలుపుతున్నామని, హుస్నాబాద్ లో ఎంపిటిసి స్థానాలు కూడా పెరుగుతున్నాయని అన్నారు. మండలంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని శాఖలకు అభివృద్ధి పనుల కోసం అవసరమైన నిధులు కేటాయించుకున్నామని వాటిని సక్రమంగా వినియోగిస్తూ గ్రామాల రూపు రేఖలు మార్చామని అన్నారు. ఈ అభివృద్ధి నిరంతరం ఇలాగే కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లకవత్ మానస సుభాష్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజిని తిరుపతిరెడ్డి, ఎంపీడీవో కుమారస్వామి , సర్పంచ్ లు తోడేటి రమేష్ , భక్తుల మల్లయ్య,పిట్టల సంపత్, బత్తుల సునీత, దేవశాని సుశీల , దుండ్ర భారతి, ఎంపీటీసీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love