టీఎన్ జీఓ సంఘం ఆధ్వర్యంలో, జాతీయ పతాక ఆవిష్కరణ రక్తదాన శిబిరం

నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని టీఎన్జీవో ఎస్ ఆధ్వర్యంలో టీఎన్జీవోఎస్ కార్యాలయం ఎదుట జిల్లా జేఏసీ చైర్మన్ అలుక కిషన్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఆయా శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీ ఎన్ జీ ఓ ల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రక్తదానం చేయడం పట్ల మంత్రి వారిని అభినందించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత తెలంగాణ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువగా ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, యావత్ దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీ ఎన్ జీ ఓ ల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, అమృత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love