భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య 

నవతెలంగాణ – నసురుల్లాబాద్ (బీర్కూర్)
భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం. బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన మేత్రి మధు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బ్రతుకు దేరువు కోసం ఆర్మూర్ ప్రాంతంకు వెళ్లి వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. ఈయనకు ఐదు ఏండ్ల క్రితం వివాహం కాగా కుటుంబ కలహాలతో కొద్దీ రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. ఆమె తిరిగి కాపురానికి రాకపోవడంతో భర్త మనస్తాపానికి గురయ్యాడు. గత వారం రోజుల క్రితం సొంత గ్రామానికి వచ్చాడు. సోమవారం రాత్రి ఇంటి పక్కన ఉన్న చెట్టుకు  ఉరేసుకుని చనిపోయాడు. ఉదయం చూసే సరికి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న కొడుకును చూసి కన్నీరుమున్నీరు అయింది. స్థానికులు చూసి  పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని బీర్కూర్ పోలీసులు వచ్చి పరిశీలించి, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Spread the love