రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తల్లి కి తెలంగాణా మహిళా సంక్షేమ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో విడిచి బ్యాంకు లో ఒక పని నిమిత్తం డిచ్ పల్లి నుండి ఇందల్ వాయి కి ద్విచక్ర వాహనం పై ఒక స్నేహితుడి తో కలిసి వస్తుండగా మార్గమధ్యంలోని డిచ్ పల్లి మండల కేంద్రంలోని నగ్ పుల్ బ్రిడ్జి వద్ద వెనుక నుండి వస్తున్న కంటైనర్ డీ కోవడం తో అభిషేక్ 22 అక్కడికక్కడే ప్రాణాలు వదలగా వెనుక ఉన్న ఇంకోక్కరికి తివ్ర గాయాలైనట్లు ఎస్సై కచ్చకాయల గణేష్ తెలిపారు.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.డిచ్ పల్లి మండలం లోని దేవ నగర్ క్యాంపు కు చెందిన సలటికి సులోచన అంగన్ వాడి టీచర్ గా పనిచేస్తుంది. డిచ్ పల్లి మండల కేంద్రంలో జరుగుతున్న తెలంగాణ సంక్షేమ దినోత్సవ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి అభిషేక్ తల్లిని ఒక పని నిమిత్తంతో కలిసి ఇందల్వాయికి వస్తుండగా మార్గమధ్యంలోని నాగపూర్ వద్ద వెనుక నుండి వస్తున్న ఒక గంట వాహనాన్ని ఢీకొనడంతో అభిషేక్ కంటైనర్ కిందకి వచ్చి అక్కడికక్కడే మృతి చెందారు.సులోచన కు ముగ్గురు సంతానం. పెద్దకొడుకు అభిషేక్ బిటెక్ విద్యార్థి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో ఉన్న తల్లికి తెలిసినవారు ఫోన్ చేసి విషయం చెప్పిన వెంటనే వందల సంఖ్యలో ఉన్న మహిళలు ఒక్కసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోయారు అప్పుడే ప్రారంభమైన సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభిషేక్ మృతి వార్త విని రెండు నిమిషాల మౌనం పాటించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తిరగాలలో తిరగాల పాలైన తీవ్ర గాయాల పాలైన వినోద్ కు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఒక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడిపినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని మార్చడానికి తరలించినట్లు ఎస్సై కచ్చకాయల గణేష్ వివరించారు. గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండే అభిషేక్ మృత్వత విన్న దేవినగర్ క్యాంప్ వాసులు హుటాహుటిన చేరుకున్నారు.సర్పంచ్ ఖాతిజా యూసఫ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.

Spread the love