డ్రైవర్‌ నిద్రమత్తుకు ముగ్గురు కార్మికులు మృతి.. 33మందికి గాయాలు

నవతెలంగాణ – లఖింపూర్‌ : డ్రైవర్‌ నిద్రమత్తు ముగ్గురు కార్మికులను బలి తీసుకుంది. ఇటుకబట్టీలో పనిచేసే కూలీలు పిలిభిత్‌లో శుక్రవారం తెల్లవారుజామున మొరాదాబాద్‌ నుండి లఖింపూర్‌ ఖేరీకి వాహనంలో వెళుతుండగా, అస్సాం హైవేపై బిజ్నోర్‌ గ్రామ సమీపంలో డిసిఎం డ్రైవర్‌ నిద్రపోయాడు. దీంతో డిసిఎం అదుపుతప్పి చెట్టును ఢకొీంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మఅతి చెందారు. 33 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను డిసిఎం నుంచి బయటకు తీసి జిల్లా ఆస్పత్రికి తరలించారు. డిసిఎంలో తీవ్రంగా ఇరుక్కున్న డ్రైవర్‌ను మూడున్నర గంటలపాటు శ్రమించిన తర్వాత బయటకు తీయగలిగారు. అతడి పరిస్థితి విషమించడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ధ్వంసమైన వాహనాన్ని పోలీసులు బయటకు తీశారు. ప్రమాదం జరిగిన తర్వాత హైవేకి ఇరువైపులా వాహనాలు ఆగిపోయాయి. సమాచారం అందుకున్న డీఎం, ఎస్పీలు కూడా వైద్య కళాశాలకు చేరుకున్నారు. క్షతగాత్రుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డీసీఎంలో దాదాపు 50 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love