ఇసుక లారీల నిలుపుదలతో పొంచి ఉన్న ప్రమాదాలు

నవతెలంగాణ – గోవిందరావుపేట
లారీలను ఆపకుండా చేయాలని కోరుతున్న ప్రజలు మండలంలోని పసర గ్రామంలో 163 వ జాతీయ రహదారిపై సాయంత్రం వేళ కిలోమీటర్ల కొద్ది ఇసుక లారీలు నిలిపి ఉంచడం వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు. ప్రధానంగా సినిమా హాలు మొదలుకొని ఒకటి నుండి రెండు కిలోమీటర్ల బారు ప్రతిరోజు సాయంత్రం ఇసుక లారీలను నిలుపుతూ డ్రైవర్లు వంటలు చేసుకుంటూ భోజనాలకు వెళుతూ గంటల తరబడి లారీలను ఉంచుతున్నారు. ఈ రెండు కిలోమీటర్ల దూరంలో ఆ సైడ్ లో ఉన్న వీధుల జనం ఇబ్బంది పడుతున్నారు. కొందరు డ్రైవర్లు బజారు ఎదురుగానే ఉంచడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు. దూరంలో ఆపిన లారీ డ్రైవర్లు నడుచుకుంటా థియేటర్ వద్దకు వెళ్లి సమపంలో ఉన్న హోటల్లో భోజనాలు టిఫిన్లు చేయడం మరికొందరు ఏకంగా మద్యం దుకాణాలకు వెళ్లి మద్యం సేవించి పురసతిగా వచ్చి లారీలు తీస్తారు. ఈ గంటల తరబడి కాలంలో పక్క బజార్లలో ఉండే జనం ద్విచక్ర వాహనాలు కార్లు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడమే కాకుండా ప్రధాన రహదారికి వచ్చేముందు ఏమి కనపడకపోవడం వల్ల తరచూ ప్రమాదాలకు తావిస్తుందని అంటున్నారు. సాయంత్రం వేళ లారీలను నిలుపుదల చేయకుండా పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక పసర పోలీస్ స్టేషన్లో కూడా పలుమార్లు పోలీసులకు చెప్పడం జరిగింది. ఒకటి రెండుసార్లు పోలీసులు వచ్చి క్లియర్ చేసినప్పటికిని మరుసటి రోజు మళ్లీ లారీల క్యూ లైన్ దర్శనమిస్తుంది. కొద్ది రోజులపాటు ప్రతిరోజు సాయంత్రం వేళ ఒకరు లేక ఇద్దరు కానిస్టేబుల్ లారీలను నిలుపుదల చేయకుండా ప్రయత్నిస్తే తర్వాత ఈ సమస్య తలెత్తదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ప్రమాదాలు కూడా నివారించబడతాయని అంటున్నారు. లారీలు నిలిపించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఏలేటి రాజు పసర గ్రామస్తుడు. సాయంత్రం వేళ లారీలను నిలిపివేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వీధులకు అడ్డంగా లారీలు నిలపడం వల్ల ద్విచక్ర వాహనాలు కార్లు బయటకు రాకుండా లోనకు వెళ్లకుండా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్లు లారీలను నిలిపివేసి గంటల తరబడి బయటకు పోయి రావడం లారీ తీయాలని ముత్తుకున్న పట్టించుకునే వారే ఉండరు. ఊరి బయట ఉన్న హోటల్ల వద్ద లారీలు నిలిపితే ఎలాంటి సమస్య ఉండదు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

Spread the love