నవతెలంగాణ – హైదరాబాద్: తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పిఠాపురం వెళ్తున్నాననే ప్రచారంలో వాస్తవం లేదు. అక్కడికి నేను రావాలని పవన్ కోరుకోడు. ఎన్టీఆర్ భారతరత్నకు అర్హులు. కూటమి ప్రభుత్వం వస్తే ఆయనకు భారతరత్నపై ఆలోచించాలి’’ అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.